అనంతబాబుకు సమాచారం అందించినట్టు ఆరోపణలు.. సీఐపై వేటు

  • డ్రైవర్ హత్య కేసులో ఏ1గా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు
  • కేసు దర్యాప్తు సమాచారాన్ని ఆయనకు అందించినట్టు సీఐ రవికుమార్ పై ఆరోపణలు
  • వీఆర్ కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేసిన ఏలూరు రేంజ్ ఐజీ

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు పోలీసుల అంతర్గత సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో సర్పవరం సీఐ రవికుమార్‌పై వేటు పడింది. కేసు దర్యాప్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన రహస్య సమాచారాన్ని, పోలీసుల కదలికలను సీఐ రవికుమార్ ఎప్పటికప్పుడు అనంతబాబుకు చేరవేస్తున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. 


దర్యాప్తు పారదర్శకతను దెబ్బతీస్తూ నిందితుడికి సహకరించినందుకు గాను, ఏలూరు రేంజ్ ఐజీ ఆయనను తక్షణమే విధుల్లో నుంచి తప్పించి, వీఆర్ కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనపై శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశాలు జారీ చేశారు.

Anantha Babu
YSRCP
CI Ravi Kumar

More Telugu News